వ్యాపారస్తులు దుకాణాల ముందు చెత్త వేయవద్దు

62చూసినవారు
వ్యాపారస్తులు దుకాణాల ముందు చెత్త వేయవద్దు
జన్నారంలోని వ్యాపారులు వారి దుకాణాల ముందు చెత్తను వేయవద్దని పొన్కల్ గ్రామ ఈవో రాహుల్ సూచించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ, పంచాయతీ ట్రాక్టర్ ద్వారా చెత్తను సేకరిస్తున్నామని వెల్లడించారు. అయితే చాలామంది వ్యాపారులు దుకాణాల ముందు చెత్తను వేస్తున్నారని, దీంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయన్నారు. వ్యాపారులు వారి చెత్తను డస్ట్ బిన్ లలో వేస్తే పంచాయతీ కార్మికులు సేకరిస్తారని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్