పారిస్ ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్‌లో మహిళల సింగిల్స్‌లో తెలుగమ్మాయి ఆకుల శ్రీజతో పాటు స్టార్ ప్లేయర్ మనిక బత్రా రౌండ్ ఆఫ్ 32కు దూసుకొచ్చారు. రౌండ్ ఆఫ్ 64లో మనిక బత్రా 4-1 తేడాతో బ్రిటన్ క్రీడాకారిణి అన్నా హర్సీని ఓడించింది. శ్రీజ 4-0 తేడాతో స్వీడన్ క్రీడాకారిణి క్రిస్టినాని మట్టికరిపించింది.