టీమ్ ఇండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ ఓ ఇంటి వాడయ్యారు. తన స్నేహితురాలు శృతి రంగనాథన్‌ను ఆయన పెళ్లి చేసుకున్నారు. బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. కాగా, వెంకటేశ్ అయ్యర్ భారత్ తరఫున 9 టీ20లు, 2 వన్డేలు ఆడారు. ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.