విషాదం.. 15 మంది చిన్నారులకు విద్యుత్ షాక్

78704చూసినవారు
కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరులో విషాదం చోటుచేసుకుంది. ఉగాది పండుగ సందర్భంగా ప్రభలు లాగుతుండగా విద్యుత్ షాక్ తగలడం సంచలనంగా మారింది. ఈ ప్రమాదంలో 15 మంది చిన్నారులకు తీవ్ర గాయాలు కావడంతో వారిని కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే చిన్నారుల్లో పలువురి పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్