చైనాలోని తైవాన్ ప్రాంతంలో ఆదివారం భారీ
భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.3 తీవ్రత నమోదైంది. తైవాన్‌లోని తైటుంగ్ కౌంటీకి సమీపంలో 16.5 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ
భూకంపం వల్ల కౌంటీలో స్పల్వ ప్రకంపనలు వచ్చాయి. ప్రజలు భయాందోళనకు గురై ఇంటి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ ప్రకంపనల వల్ల ప్రాణనష్టం, ఆస్థి నష్టం జరిగినట్లుగా ఇప్పటికీ సమాచారం లేదు.