ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఇవాళ ఉదయం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. స్థానిక గోగుండా కొండపై మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో మావోయిస్టులు కాల్పులకు దిగారు. ఎదురుకాల్పులు జరిపిన పోలీసులు 20 మందిని హతమార్చారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్‌గార్డ్, CRPF బలగాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.