ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (ఓసీఏ) అధ్యక్షుడిగా ఇటీవల రణధీర్ సింగ్ అనే భారతీయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆసియాలోని 45 దేశాల ప్రతినిధుల్లో 44 మంది రణ్‌దీర్‌కు మద్దతిచ్చారు. ఓ భారతీయుడు ఈ పదవికి ఎన్నికవడం ఇదే తొలిసారి. నాలుగేళ్లపాటు ఈయన ఈ పదవిలో కొనసాగుతారు. ఓసీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన ఈయన భారత్ తరపున ఐదు సార్లు ఒలింపిక్స్ షూటింగ్ పోటీలకు ప్రాతినిధ్యం వహించారు.