సూర్య నటించిన కంగువా మూవీ OTTలోకి వచ్చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా డిసెంబర్ 13 నుంచి తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సిరిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను రూ.100 కోట్లకు దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం నెగటివ్ టాక్ తెచ్చుకుని కలెక్షన్లు రాబట్టలేకపోయింది. దేశంలోనే రెండో డిజాస్టర్ మూవీగా నిలిచి చెడ్డ పేరు మూటగట్టుకుంది.