కరీంనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం

80చూసినవారు
కరీంనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం
కరీంనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జిల్లాకేంద్రానికి వెళ్లే రాజీవ్ రహదారిపై హకీంపేట సమీపంలో వాహనాల్లో ఫిల్ చేసే సీఎన్‌జీ గ్యాస్ సిలిండర్స్ తీసుకెళ్తున్న ఓ వాహనానికి ప్రమాదవశాత్తూ నిప్పు అంటుకుని మంటలు చెలరేగాయి. మంటలు మరింత వ్యాపించి వెనక ఉన్న సిలిండర్లు పేలితే భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దీంతో ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్