అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దేశ ప్రజలకు వరుసగా షాక్ లు ఇస్తూనే వస్తున్నారు. అమెరికా రెవెన్యూ సర్వీసులో 20 వేల ఉద్యోగాల కోత విధిస్తూ ఆదేశాలు జారీచేశారు. 20 నుంచి 25 శాతం సిబ్బందికి లే ఆఫ్‌లు ఇచ్చినట్లు తెలుస్తోంది. లే ఆఫ్‌లు ఇచ్చి సిబ్బందికి మెయిల్స్ వెళ్లాయని యూఎస్ ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ అధికారులు తెలిపారు. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ట్రంప్ ఉద్యోగాల కోత విధిస్తున్నట్లు సమాచారం.