AP: సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ 100 నుంచి 300 పడకల సామర్థ్యంతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించేలా కార్యాచరణ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వైద్య సేవల్ని మరింత విస్తృతం చేయాలని సూచించారు. కాగా, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు గాను 100 పడకలకు పైగా సామర్థ్యం ఉన్న ఆస్పత్రులు ఇప్పటికే 70 వరకు ఉన్నాయి.