హుస్నాబాద్: కాలువల ద్వారా ప్రతీ గ్రామానికి సాగునీరు అందిస్తాం
ప్రాజెక్టు నీటిని కాలువల ద్వారా ప్రతీ గ్రామానికి సాగునీరు అందిస్తామని రాష్ట్ర మంత్రి పోన్నం ప్రభాకర్ శనివారం అన్నారు. కోహేడ మండలంలోని శనిగరం రిజర్వాయర్లో 100 శాతం రాయితీపై ఉచిత చేప పిల్లలను విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల వారు ఆర్థికంగా ఎదిగేందుకు గతంలో కన్నా ఎక్కువగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నామన్నారు.