తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తూప్రాన్ మున్సిపాలిటీ 4 త్ వార్డులో స్వయంభు మహిమల కప్పెర లక్ష్మీ నరసింహ స్వామి తూప్రాన్ పట్టణ కేంద్రంలో కౌన్సిలర్ మామిళ్ల జ్యోతి కృష్ణ అద్వర్యంలొ ఘనంగా ఆధ్యాత్మిక దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని కప్పెర నరసింహా స్వామీ ప్రముఖ పూజారి రమణయ్య పంతులు ప్రత్యేక అలంకరణ, అభిషేకాలు, పూజా కార్యక్రమాలు అత్యంత భక్తులతో నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు అన్ని గ్రామాలలో ఉన్న దేవాలయాలకు ప్రత్యేక శోభ సంతరించుకుందని, ప్రతి ఆలయం ధూప దీప నైవేద్యాలతో కళకళలాడుతున్న విషయాన్ని కౌన్సిలర్ మామిళ్ల జ్యోతి కృష్ణ గుర్తు చేశారు.
కప్పెర లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ కమిటీ అధ్యక్షులు మామిళ్ల కృష్ణ మీడియాతో మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం ఆలయాలకు పెద్దపీట వేశారని చెప్పడానికి యాదాద్రి ఆలయ పునర్నిర్మాణమే చక్కటి నిదర్శనం అన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం వెలసిన మహిమల గల తూప్రాన్ నరసింహ స్వామి దేవాలయం కు ప్రతి నెల దూప దీప నైవేద్యం పథకం కింద పూజ కార్యక్రమాల కొరకు 6, 000మంజురు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి
కేసీఆర్ మంత్రి హరీష్ రావు, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎప్డీసి చైర్మన్ వంటెర్ ప్రతాప్ రెడ్డి, ఎలక్షన్ రెడ్డి లకు ధన్యవాదాలు క్రుతజ్ణతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజి ఎంపిటిసి తిమ్మాపురం నరసింహులు, 4 వార్డు బిఆర్ఎస్ పార్టీ నాయకులు బోల్లు నాగరాజు, టి అంజయ్య ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.