నిజామాబాద్ కు విచ్చేసిన ఎమ్మెల్సీ కోదండరామ్ ని 2003 DSC పాత పెన్షన్ సమస్య ను గుర్తు చేస్తూ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కోరడం జరిగింది. కోదండరామ్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్షి మరియు ముఖ్యమంత్రితో మాట్లాడుతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఎస్సీ 2003 పాత పెన్షన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్, రాష్ట్ర జిల్లా నాయకులు కనకపురం రవీందర్, ప్రసాద్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.