తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాన్ని వ్యవసాయ భూమి లేని నిరుపేదలు, ఉపాధి హామీ పనులు చేసే వారికి ఈ పథకం వర్తిస్తుందని, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గురువారం తెలిపారు. రామాయణపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు కోసం క్షేత్రస్థాయిలో అధికారులు సర్వే చేపడుతున్నారని, పారదర్శకంగా ఈ సర్వే కొనసాగుతుందన్నారు.