మతోన్మాద శక్తులను తరిమికొట్టాలి

774చూసినవారు
మతోన్మాద శక్తులను తరిమికొట్టాలి
దేశంలో రాష్ట్రంలో మతోన్మాద శక్తులను తరిమికొట్టాలని బిఎస్పి చేగుంట మండల అధ్యక్షుడు భానుచందర్ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17 పై బిజెపి రాద్ధాంతం చేస్తుందని తెలంగాణలో మత కల్లోలాలు రెచ్చగొట్టాలని బిజెపి యత్నిస్తుందని బండి సంజయ్ కి తెలంగాణ రాష్ట్ర రైతాంగ సాయుధ పోరాట చరిత్ర తెలుసా అని విమోచన విలీన సమైక్యత అనే పేరుతో ప్రజలను గందరగోళానికి పార్టీలు సృష్టిస్తున్నాయని ప్రజలకు చరిత్ర చెప్పడం మానేసి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయని ఆరోపించారు. రజాకారుల ఆగడాలు పటేల్ పట్టు వారి జాగిర్దారుల వ్యవస్థ గురించి ప్రజలకు పాఠ్యపుస్తకాల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్