మెదక్: అమరులైనా పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం
మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపం వద్ద అమరవీరుల కుటుంబ సభ్యులు, పోలీస్ అధికారులతో కలసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ ఘనంగా నివాళులర్పించారు. ప్రజల రక్షణ, ధన, మాన ప్రాణాల గురించి అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసులు, అమరులైన పోలీస్ కుటుంబాలకు జిల్లా యంత్రాంగం ఎప్పుడూ అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.