108 వాహనంలోనే సాధారణ ప్రసవం, తల్లి, బిడ్డ క్షేమం
మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం పోచంరాల్ కి చెందిన కళావతి, పురిటి నొప్పులతో బాధపడుతున్న కళావతిని 108 సిబ్బంది మెదక్ ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నా క్రమంలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో 108 వాహనంలోనే సాధారణ ప్రసవం చేశారు. పండంటి ఆడబిడ్డకు కళావతి జన్మనిచ్చింది. తల్లి, బిడ్డను మెదక్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు.