ఎమ్మెల్యే నివాసంపై దాడి చేసిన వారిని శిక్షించకుండా, బీఆర్ఎస్ నాయకులపై అవాకులు చివాకులు మాట్లాడితే ఊరుకునేది లేదని మాజీ గ్రంథాలయ బోర్డ్ చైర్మన్ చంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించారు. నర్సాపూర్లో బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మైనంపల్లి హనుమంతరావు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై దాడి చేసిన ప్రభుత్వం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.