రాష్ట్రం ఏర్పాటయ్యాక బీఆర్ఎస్ ప్రభుత్వం తండాలను నూతన గ్రామ పంచాయతీలుగా మార్చి అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చిందని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతారెడ్డితో కలిసి మండలంలోని శిలాంపల్లి, సంమ్లా తాండ, గుజిరి తాండ, గన్యతాండ, చిట్కుల్ గ్రామ పంచాయతీ భవనాలకు శంకుస్థాప నలు, చిలప్ చెడ్, గౌతాపూర్, గంజిరితండాల్లో సీసీ రోడ్ల పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వినోద దుర్గారెడ్డి, వైస్ ఎంపీపీ విశ్వంభస్వామి, ఎంపీడీవో శశి ప్రభ, పీఆర్ డీఈఈ అమరే శ్వర్, పీఆర్ఎస్ఈ మధుబాబు, జడ్పీ కో ఆప్షన్ నెంబర్ మన్సూర్, నర్సాపూర్ ఆత్మ చైర్మన్ గొర్రె వెంకట్ రెడ్డి, కొల్చారం జెడ్పీటీసీ మేఘమాల సంతోష్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షురాలు లక్ష్మీ దుర్గా రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అశోక్ రెడ్డి, ఉపాధ్య క్షుడు లక్ష్మణ్, సర్పంచులు కవిత ముకుందా రెడ్డి, కోల బిక్షపతి, గోపాల్ రెడ్డి, రాకేష్ నాయక్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.