నర్సాపూర్ మండలం చిన్న చింతకుంట గ్రామానికి చెందిన బ్యాగరి వీరమని భర్త స్వామికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన 30 వేల రూపాయల చెక్కును ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో చిన్న చింతకుంట గ్రామానికి చెందిన బారాసా సీనియర్ నాయకులు నర్సింగ్ రావు, తాజా మాజీ సర్పంచ్ బుర్ర సురేష్ గౌడ్, బిక్షపతి గౌడ్, రాము, మురళీ గౌడ్, కుమ్మరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.