మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో వర్ష కాలం రైతు భరోసా పథకం అమలు చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం ఆందోళన నిర్వహించారు. గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జి వంటేరు ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో తూప్రాన్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద పాత హైవే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రైతులకు రైతుబంధు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు.