మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి శివారులో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఎదురు ఎదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని108లో నర్సాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.