సంగారెడ్డి మున్సిపాలిటీలో ఈనెల 5వ తేదీన మంచినీటి సరఫరా నిలిపి వేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు కురిసినందున పట్టణానికి మంచినీటి సరఫరా చేసే మిషన్ భగీరథ మోటర్లు వరద నీటిలో మునిగి పాడైనట్లు చెప్పారు. అత్యవసరమైన కాలనీలకు మంచినీటి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తామని పేర్కొన్నారు.