తెలంగాణలో అన్ని జిల్లా కేంద్రాల్లోని మార్కెట్లను ఆధునికీకరించడంతోపాటు WGL, నిజామాబాద్, KMM వంటి పెద్ద మార్కెట్లను మరింత అభివృద్ధి చేసేందుకు నివేదికలు సిద్ధం చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్ సమీపంలోని కొహెడ వద్ద అత్యాధునిక మెగా మార్కెట్‌ను నిర్మిస్తామని ప్రకటించారు. ఔటర్, రీజినల్ రింగు రోడ్డు మధ్యలో రూ.2వేల కోట్లతో 400 ఎకరాల్లో దీనిని నిర్మించనున్నట్లు వివరించారు. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.