యూపీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కాస్గంజ్ జిల్లా పాటియాలి తహసీల్ ప్రాంతంలోని నార్దౌలి గ్రామంలోని గోధుమ పొలంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటల కారణంగా గోధుమ పంట పూర్తిగా కాలిపోయింది. దీంతో ప్రభుత్వమే ఆదుకోవాలని సదరు రైతు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.