రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ మరో కీలక ప్రకటన
By తానూరు గోపిచంద్ 69చూసినవారుTG: రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి రేషన్ కార్డులు ఇస్తామని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని మంత్రి మండిపడ్డారు. గత ప్రభుత్వంలో కేవలం 40 వేల రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చినట్లు పేర్కొన్నారు. గ్రామసభల్లో ప్రకటించే జాబితా ఫైనల్ కాదని.. దరఖాస్తుల పరిశీలన తర్వాతే తుది జాబితా విడుదల చేస్తామని అన్నారు.