రెస్టారెంట్ యజమానిపై ఎమ్మెల్యే దాడి (వీడియో)

85చూసినవారు
పశ్చిమబెంగాల్ తూర్పు మిడ్నాపూర్‌లోని చాందీపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సోహమ్ చక్రవర్తి తీరు వివాదాస్పదంగా మారింది. కోల్‌కతాలోని న్యూటౌన్ ప్రాంతంలో ఓ రెస్టారెంట్‌కు శుక్రవారం ఆయన వెళ్లాడు. పార్కింగ్ స్థలంలో కారు విషయంలో రెస్టారెంట్ సిబ్బందితో ఆయన గొడవ పడ్డారు. సర్ది చెప్పేందుకు యత్నించిన రెస్టారెంట్ యజమాని అనిసుల్ ఆలంపై ఎమ్మెల్యే దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్