AP: తనపై అసత్య వార్తలు రాసే మీడియా ప్రతినిధులకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తన బ్యాక్ గ్రౌండ్ తెలుసుకుని వార్తలు రాయాలని హెచ్చరించారు. ఆధారాలు లేకుండా వార్తలు రాస్తే తాట తీస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. 'నాపై తప్పుడు వార్తలు రాస్తే పట్టాలపై పడుకోబెడతా.. నేను అన్నీ చేసే వచ్చా' అని అన్నారు. ఒకటి రెండు ఛానల్స్ తప్ప అందరూ తన మిత్రులేనని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.