కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, బత్తుల లక్ష్మారెడ్డిలతో కలిసి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలిశారు. ఆగస్టు 30న భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇరిగేషన్ సమీక్ష సమావేశం సందర్భంగా.. మంత్రుల కోసం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు ఎమ్మెల్యే వీరేశంను పోలీసులు వెళ్ళనివ్వకపోవడంపై ఫిర్యాదు చేశారు. పలువురు పోలీస్ అధికారులు ఎమ్మెల్యేల పట్ల ప్రోటోకాల్ పాటించడం లేదని తెలిపారు.