'పార్టీ మారిన ఎమ్మెల్యేలు మగాళ్లైతే రాజీనామా చేయాలి'

73చూసినవారు
పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మగాళ్లెతే రాజీనామా చేయాలని BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. 'దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుకు సిగ్గు, శరం, రోషం ఉండి.. అన్నం తింటుంటే రాజీనామా చేయాలి. మళ్లీ పోటీ చేసి గెలిచి చూపించాలి. ఈ ఎమ్మెల్యేల ఇంటి ముందు చావు డప్పు కొడతాం. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నిక వచ్చే వరకు పోరాడతాం' అని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్