AP: కాకినాడ జిల్లా ఖండవల్లి గ్రామానికి చెందిన దుర్గారావు (29) కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తన భార్య దివ్యకుమారి అదే గ్రామానికి చెందిన అమోఘ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుందని, దుబాయికి వెళ్లి సంపాదించినంతా దివ్యకుమారి ప్రియుడికి దోచిపెట్టిందని రాసుకొచ్చారు. ఆర్థికంగా చితికిపోయానని, తన చావుకు కారణం అమోఘ్, దివ్యకుమారి అని పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.