మధ్యప్రదేశ్ లో ల్యాండ్ రెవెన్యూ ఆఫీసర్ 6 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, ఈ పోస్టులకు 12 లక్షలకు పైగా దరఖాస్తులు రావడం ఆశ్చర్యం కలిగించింది. వీరిలో పీహెచ్ డీ, ఇంజినీరింగ్, ఎంబీఏ చదివిన వారు సైతం ఉన్నారు. కాగా, మధ్యప్రదేశ్ లో నిరుద్యోగ శాతం 1.9గా ఉందని ఈ జనవరిలో సీఎంఐఈ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో, ఈ స్థాయిలో దరఖాస్తులు రావడం చర్చనీయాంశమైంది.