TG: ప్రజావాణి కార్యక్రమంలో మరింత పారదర్శకమైన విధానాలను అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రజాభవన్‌లో కొనసాగుతున్న ప్రజావాణి డ్యాష్ బోర్డుతో అనుసంధానం చేయాలని చెప్పారు. 2023 డిసెంబర్ నుండి ఇప్పటివరకు 117 సార్లు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా 54,619 అర్జీలు ప్రజలు నమోదయ్యాయి. వాటిలో 68.4% పరిష్కారమయ్యాయి అని అధికారులు సీఎంకు తెలిపారు.