స్మార్ట్‌ఫోన్ తయారీదారు మోటరోలా త్వరలో తన కొత్త 5G స్మార్ట్‌ఫోన్ Moto G45ను భారతీయ మార్కెట్లో విడుదల చేయనుంది. ప్రీమియం వేగన్ లెదర్ డిజైన్ తో తీసుకొస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ ను ఆగస్టు 21న రిలీజ్ చేయనున్నట్లు దృవీకరించింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ఆక్టా కోర్ క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 6s Gen 3 చిప్ సెట్ ప్రాసెసర్ తో రాబోతున్నట్లు సమాచారం. ఇది 8GB RAM+128GB స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. అందిన సమాచారం మేరకు ఈ స్మార్ట్‌ఫోన్ ధరలు ఇంకా వెల్లడించలేదు.