ఇటిక్యాల: తహశీల్దార్‌పై దాడి హేయమైన చర్య: రాంబాబు
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండల తహశీల్దార్‌పై దాడికి పాల్పడటం హేయమైన చర్య అని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపోగు రాంబాబు అన్నారు. శనివారం ఆయన ఇటిక్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నాయకులతో కలిసి మాట్లాడారు. తహశీల్దార్‌పై దాడి చేయడంతో అనాగరిక చర్య అని అన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.