కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలంలోని బేడ బుడగ జంగాల దుద్దురుకు శంకర్ భార్య శ్యామల గత 15 రోజుల క్రితం తప్పిపోయింది. ఈ విషయాన్ని శ్యామల భర్త శంకర్ వెల్దండ మండల బేడ బుడగ జంగాల అధ్యక్షులు వానరాశి రాములు, కల్వకుర్తి తాలూకా అధ్యక్షుడు కళ్యాణం వెంకటయ్య, ఉపాధ్యక్షుడు సిరిగిరి వెంకటయ్య దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ప్రతి ఒక్కరూ కలిసి నలుమూలల శ్యామలను వెతకడం జరిగింది. చివరికి హైదరాబాదులో శ్యామల దొరకడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బేడ బుడగ జంగాల నాయకులకు ఎవరికి ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానన్నారు.