కల్వకుర్తి పట్టణానికి చెందిన స్వామి వివేకానంద సేవ బృందం అధ్యక్షులుశివ కుమార్ బుధవరం ఢిల్లీలో మాజీ కేంద్ర యువజన, క్రీడలు సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఒకటే దేశం ఒకటే ఎన్నికల పై వారి కార్యాలయంలో చర్చించి, దేశంలో ఒకేసారి ఎన్నికలు జరగడం వలన కలిగే లాభాల పై తెలంగాణ నుంచి ఎన్నికైన యువజన సంఘ నాయకునిగా మాట్లాడటం జరిగిందన్నారు.