నాగర్ కర్నూలు జిల్లా విద్యాధికారిగా బుధవారం బాధ్యతలు తీసుకున్న రమేష్ కుమార్ తొలి రోజు నుండి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం పలువురిని ఆశ్చర్యపరిచింది. కల్వకుర్తి పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసి వారి విద్యా బోధనపై ఆరా తీశారు. పాఠశాలలోని రికార్డులనుపరిశీలించారు. అనంతరం పదవ తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడిన అనంతరం వారికి గణిత బోధన చేశారు.