హైదరాబాద్ బృంగి హాస్పిటల్ యజమాన్యం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సహచర ఉద్యోగి షాంపూరి గణేష్ కుటుంబానికి శుక్రవారం 3, 30, 000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో మృతుని భార్య శివనీలకు ఆసుపత్రి యజమాన్యం 2, 50, 00 ల చెక్కు, ఆసుపత్రి సిబ్బంది 80 వేల రూపాయల చెక్కును మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మృతుడి అన్న మల్లేష్, తదితరులు. పాల్గొన్నారు.