వంగూర్ మండలం తిప్పారెడ్డిపల్లిలో శుక్రవారం ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల మహిళ టీచర్ సునీతకు జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నారమోని చంద్రశేఖర్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా టీచర్లకు ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆదేశాల మేరకు జ్ఞాపికలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత నూకం శ్రీను, చంద్రశేఖర్, హెచ్ఎం బాబురావు పాల్గొన్నారు.