నాగర్ కర్నూల్: గొంతులో కోడిగుడ్డు ఇరుక్కొని వ్యక్తి మృతి

80చూసినవారు
నాగర్ కర్నూల్: గొంతులో కోడిగుడ్డు ఇరుక్కొని వ్యక్తి మృతి
ఉమ్మడి పాలమూరు బిజినేపల్లి మండలంలో నందివడ్డేమాన్‌కు చెందిన తిరుపతయ్య (60) సోమవారం లింగాలలో ఉన్న బంధువు ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో లింగాల బస్టాండ్‌కు చేరుకున్నాడు. అక్కడి బజ్జీల బండి వద్ద కోడిగుడ్డు కొనుక్కొని తింటుండగా గొంతులో ఇరుక్కుంది. ఊపిరాడక తిరుపతయ్య కుప్పకూలాడు. స్థానికులు నీళ్లు తాగిస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్