విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న భక్తుడికి షాక్ తగిలింది. ఉగాదిని పురస్కరించుకొని ఓ భక్తుడు అమ్మవారిని దర్శించుకున్నాడు. ప్రసాదంలో భాగంగా అతనికి పులిహోర ప్యాకెట్ అందజేశారు. ప్రసాదం తింటుండగా అందులో మేకు కనబడింది. దీంతో అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. పండుగపూట కూడా ప్రసాదం తయారీపై ఆలయ సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.