ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల తాకిడి పెరిగింది. ఉగాదిని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఆలయాల్లో రద్దీ నెలకొంది. తెల్లవారు జామునుంచే భక్తులు ఆలయాలకు క్యూకట్టారు. ఇక ఉగాది నేపథ్యంలో తిరుమలలో ఉగాది ఆస్థానం, ఉగాది కవి సమ్మేళనం, నాద నీరాజనం, కవుల ఇష్టాగోష్టి వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు నాద నీరాజనం వేదికపై కవి సమ్మేళనం కార్యక్రమం జరగనుంది.