ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం రెండు మ్యాచులు జరగనున్నాయి. విశాఖపట్నం వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీ, హైదరాబాద్ తలపడనున్నాయి. ఇక రాత్రి గౌహతి వేదికగా చెన్నై , రాజస్థాన్ మధ్య కీలక పోరు జరగనుంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ తన చివరి మ్యాచులో భారీ ఓటమి చవిచూసింది. ఈ క్రమంలో హైదరాబాద్‌కు ఈ మ్యాచ్ కీలకం కానుంది.