యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి బంగారు విమాన గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవం సందర్భంగా, ఆదివారం స్వామివారి బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. ఉ. 10 నుంచి టికెట్, బ్రేక్ దర్శనాలు, శ్రీ స్వామి వారి నిత్యకళ్యాణము, పుష్పార్చనలు మొదలైన ఆర్జిత సేవలను సైతం నిలుపివేయనున్నట్లు పేర్కొన్నారు.