రామన్నపేట: ప్రభుత్వాలు పరిశ్రమలకు అనుమతులు ఇవ్వకూడదు
రామన్నపేట మండలం కోమయిగూడంలో ఏర్పాటు చేయబోయే అంబుజా సిమెంట్ పరిశ్రమ అనుమతులు నిలిపివేయాలని శుక్రవారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా కార్యదర్శి కూనూరు గణేష్ డిమాండ్ చేశారు. ఈ నెల 23న జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో పోలీసులు ఎన్ని ఆడ్డంకులు గురిచేసిన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని పరిశ్రమకు వ్యతిరేకం తెలిపారని ఆయన అన్నారు.