దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా గురువారం ఏఐటీయూసీ 105వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్మిక నేతలు మాట్లాడుతూ 105 ఏళ్లుగా కార్మికుల హక్కులకోసం, సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ అలుపెరగని పోరాటాలు చేసి ఎన్నో విజయాలు సాధించిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ, కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తుందన్నారు.