పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయంబర్స్మెంట్ లను వెంటనే విడుదల చేయాలని యుఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు సౌభన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం దేవరకొండలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం మూడు సంవత్సరాలుగా స్కాలర్షిప్ ఫీజు రీయంబర్స్మెంట్ ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థులను పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్, సందీప్, తదితరులు పాల్గొన్నారు.