బిఆర్ఎస్ పార్టీలో చేరికలు

261చూసినవారు
బిఆర్ఎస్ పార్టీలో చేరికలు
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని దేవరకొండ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ అన్నారు. దేవరకొండ మండలంలోని కాసారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ బిజెపి పార్టీల నుండి 20 మంది కార్యకర్తలు మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ గడచిన 8 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం రైతుబంధు రైతు బీమా రైతు సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని వీటికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో లేని అనేక పథకాలను ప్రవేశపెట్టి ఆచరించే చూపించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల కులవృత్తులను బలోపేతం చేస్తూ ఆర్థిక అభివృద్ధికి కృషి చేశారని ఆయన తెలిపారు. నేడు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో సిసి రోడ్లు పంచాయితీ భవనాలు పీహెచ్సీ సెంటర్లతో పాటు అన్ని మౌలిక వసతులను కల్పించి గ్రామ సీమలను బంగారు తెలంగాణ చేయడంలో కృతనిక్షయంతో ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నోముల లక్ష్మి యాదయ్య దేవరకొండ ఎంపీపీ నల్లగాసు జాన్ యాదవ్ జడ్పిటిసి మారుపాకుల అరుణ సురేష్ గౌడ్, నాయకులు ముదిగొండ మున్నా ముదిగొండ రవి, కురుమేడు బాలకృష్ణ , సుంకరం శంకర్, పోతురాజు మల్లేష్, పోతురాజు అనిల్ , తో పాటు వార్డు సభ్యులు పోతురాజు జగన్ లు పార్టీలో చేరగా తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్